విశాఖ-విజయవాడ మధ్య.. మరో రెండు విమాన సర్వీసులు

విశాఖపట్నం నుంచి విజయవాడకు మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఆదివారం నుంచి ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు ఈ సర్వీసులను నడపనున్నాయి. వీటిని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం సాయంత్రం 7:45 గంటలకు బయలుదేరి రాత్రి 8:20 గంటలకు విశాఖ చేరుకుంటుంది. అక్కడ విమానం తిరిగి 8:45 గంటలకు బయలుదేరి రాత్రి 9:50 గంటలకు విజయవాడ వస్తుందని అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ఉదయం 9:35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 10:35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7:55 గంటలకు బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నం వెళ్తుంది. ఈ సర్వీస్‌ల రాకతో విజయవాడ`విశాఖ విమాన సర్వీస్‌ల సంఖ్య మూడుకు చేరనుంది.