America: సీఐఏలో భారీగా ఉద్యోగాల కోత!

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యంత్రాంగం భారీ ఎత్తున ఉద్యోగాల్లో కోత విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇందులో భాగంగా యూఎస్ ప్రభుత్వం తాజాగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (Central Intelligence Agency)లో సంస్కరణలకు సిద్దమైంది. ఏజెన్సీలోని 1200 మంది ఉద్యోగుల ను తొలగించడానికి కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. ఇదే పంథాలో మరికొన్ని ఏజెన్సీలలోనూ వేలాది ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని వెల్లడిరచాయి. అయితే ఈ నివేదికలపై సీఐఏ ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో స్పందించాల్సి ఉంది. సీఐఏ (CIA) లోని ప్రణాళికాబద్ధమైన కోతల గురించి అమెరికా ప్రభుత్వం చట్టసభ సభ్యులకు తెలియజేసినట్లు సమాచారం. ఏజెన్సీలో ఇకపై నియామకాలు తగ్గింపునకు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.