అమెరికా వృద్ధి 2.8 శాతం

జులై`సెప్టెంబరులో అమెరికా ఆర్థిక వ్యవస్థ 2.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. వినియోగదారు వ్యయాలు పెరగడం, ఎగుమతుల జోరు ఇందుకు దోహదపడ్డాయని ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్-జూన్‌లో నమోదైన 3 వృద్ధితో పోలిస్తే ఇది తక్కువే అయినా, తొలి అంచనాలకు అనుగుణంగానే ఉంది. గత 9 త్రైమాసికాల్లో 8 సార్లు అమెరికా ఆర్థిక వ్యవస్థ 2 శాతానికి పైగా వృద్ది సాధించింది.