లారస్ ప్లాంట్లో అమెరికా తనిఖీలు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ లారస్ ల్యాబ్‌నకు చెందిన ప్లాంట్లో అమెరికా నియంత్రణ మండలి తనఖీలు నిర్వహించింది. హైదరాబాద్‌కు సమీపంలోని శామీర్‌పేటలోని జినోమ్ వ్యాలీలో కంపెనీకి ఉన్న ఏపీఐ తయారీ యూనిట్‌లో యూఎస్‌ఎఫ్‌డీఏ అధికారులు ఆడిట్ నిర్వహించి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని వెల్లడిరచింది.