ప్రపంచంలోనే తొలిసారిగా.. గాల్లో ఎగిరే కారు
అమెరికాలో కొత్తగా ఫ్లయింగ్ కారు సిద్దమైంది. అలెఫ్ ఏరోనాటిక్స్ రూపొందించిన ఎగిరే కారుకు అమెరికా ప్రభుత్వం ఆమోద ముద్ర లభించింది. ప్రపంచంలోనే తొలిసారిగా గాల్లో ఎగిరే తొలి విద్యుత్తు కాదు ఇదే. దీని ధర 3 లక్షల డాలర్లు. అంటే మన కరెన్సీలో దీని విలువ రూ.2.4 కోట్లకు పై మాటే. అయితే ఈ కార్లు 2025 చివరి నాటికి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్లు అలెఫ్ సంస్థ పేర్కొంది. కాలిఫోర్నియాలోని శాన్మాటియో కేంద్రంగా ఈ కారును తయారు చేశారు. దీనిలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించేందుకు అవకాశముంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ప్రత్యేక ధ్రువీకరణ పొందినట్లు తయారీ సంస్థ వెల్లడిరచింది. ఓ ఫ్లయింగ్ కారుకు ఈ విధమైన అనుమతి లభించడం ఇదే తొలిసారి.






