వడ్డీ రేట్లలో మార్పు లేదు : అమెరికా

జెరోమ్ పావెల్ ఆధ్వర్యంలోని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాదిలో నిర్వహించిన తొలి పరపతి విధాన సమావేశంలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడానికే మొగ్గు చూపింది. దీంతో జులూ నుంచి ఉన్న 5.25-5.5 శాతం వడ్డీ రేటును కొనసాగించినట్లయింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపు లోనే ఉన్నా 2 శాతం వైపునకు స్థిరంగా కదులుతోందని నమ్మకం కలిగేంత వరకు రేట్ల సవరింపు జోలికి ఫెడ్ వెళ్లకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాదిలో జూన్ నుంచి రేట్ల కోతకు ఫెడ్ శ్రీకారం చుడుతుందని అంచనా వేస్తున్నారు.