అమెరికన్ డాలరుతో పోలిస్తే.. రెండేళ్లలో మొదటిసారిగా
అమెరికన్ డాలరుతో పోలిస్తే గత రెండేళ్లలో మొదటిసారిగా రష్యన్ కరెన్సీ రూబుల్ పటిష్ట స్థాయికి చేరింది. రెండు విదేశీ బాండ్లపై రష్యా డాలరు చెల్లింపులు గడువు ముగిసేలోగా పరపతిదారులకు చేరాయి. విదేశీ మారక వాణిజ్యంతో డాలరుతో 66.43 రష్యన్ రూబుల్స్ రేటున మారకం జరిగిందని బ్లూమ్‌బెర్గ్ డేటా తెలియజేసింది. ఆ తర్వాత రూబుల్ కొంత నష్టపోయింది. పబ్లిక్ హాలిడే కారణంగా మస్కో ఎక్స్చేంజ్ మూతపడిరది. తిరిగి బుధవారం ప్రారంభమైన తర్వాత వాడరుకు 69 రూబుల్స్ పలికింది. 2020 మే తర్వాత అత్యధిక రేటు ఇదే. యూరోతో మారకంలోనూ రూబుల్స్ పటిష్టంగానే ఉంది. ఉదయం ట్రేడింగ్ సమయంలో ఒక యూరోకు 72 రూబుల్స్‌గా ఉంది.






