సోవియట్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన అమెరికా… ఎందుకో తెలుసా?

వేలం పాటలో అమెరికా పాత యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. ఇవన్నీ నాటి సోవియట్ యూనియన్‌లో తయారైన మిగ్ విమానాలే కావడం గమనార్హం. ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో అంతర్భాంగా ఉన్న కజక్‌స్థాన్ తన వాయుసేన పాత కాలం నాటి యుద్ద విమానాలను వేలం వేసింది. మొత్తం 117 విమానాలను వేలం వేయగా అందులో 81 విమానాలను అమెరికా కొనుగోలు చేసింది. ఇందులో మిగ్-31 ఇంటర్‌సెప్టర్లు, ఇగ్-27 ఫైటర్ బాంబర్లు, మిగ్-29 బాంబర్లు, సు-24 బాంబర్లు ఉన్నాయి. ఇవనీ 1970, 1980 ప్రాంతాల్లో తయారైనవే. వీటిని 2.26 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.20 కోట్లు)కు కొనుగోలు చేసింది. ఒక్కొక్క యుద్ద విమానాన్ని రూ.16 లక్షలకు దక్కించుకొంది. ఇవి ఎందుకు కొనుగోలు చేసిందన్నది తెలియకపోయినా ఉక్రెయిన్ యుద్దంలో ఉపయోగించుకునే అవకాశం ఉంది.