రూ.24,700 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి

అమెరికాలో బాండ్ రాబడి పెరగడంతో ఈ నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ) దాదాపు రూ.24,700 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. మరోవైపు డెబిట్ మార్కెట్లో వారు బుల్లిష్‌గా ఉన్నారు. ఇదే కాలంలో డెబిట్ మార్కెట్లో ఎఫ్‌పిఐలు రూ.17,120 కోట్లు జోడించారు. డేటా ప్రకారం భారతీయ ఈక్విటీల్లో ఎఫ్‌పిఐ నికర పెట్టుబడి రూ.24,734 కోట్లు ఉంది. దీనికి ముందు డిసెంబర్‌లో ఇన్వెస్టర్లు రూ.66,134 కోట్లు, నవంబర్‌లో రూ.9000 కోట్లను ఇన్వెస్ట్ చేశారు.