ఆ దేశం నుండి అన్ని దిగుమతులపై నిషేధం
రష్యాతో వాణిజ్య సంబంధాలను ఉక్రెయిన్ అధికారికంగా తెంచుకుంది. ఆ దేశం నుండి అన్ని దిగుమతులను నిషేధించినట్లు ఆర్థిక మంత్రి యులియా సివైర్దెంకో తెలిపారు. ఇకపై రష్యా సమాఖ్య నుంచి అన్ని ఉత్పత్తుల దిగుమతులు నిలిచిపోతాయని ఆమె పేర్కొన్నారు. పరస్పర వాణిజ్యం ద్వారా వచ్చిన మొత్తాలను సైనిక చర్యకు నిధులుగా ఉపయోగించకుండా వుండేలా చూసేందుకే ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.
యుద్దానికి ముందు ఉక్రెయిన్ కీలక వాణిజ్య భాగస్వాముల్లో రష్యా ఒకటిగా వుంది. 600 కోట్ల డాలర్ల మేరకు వార్షిక దిగుమతులు వుండేవి. అధికారికంగా ప్రకటించకపోయినా గత ఆరు వారాలుగా ఇరు దేశాల మధ్య ఎలాంటి వస్తు సేవల మార్పిడి జరగడం లేదు. ఇప్పటికే 30 దేశాల రష్యాపై ఆంక్షలతో విరుచుపడ్డాయి. రష్యాపై ఇంధన ఆంక్షలు విధించి, అన్ని రష్యా బ్యాంకులను ఏకాకి చేయాలని ఆమె కోరారు.






