జాక్‌పాట్ అంటే ఇదే … లాటరీలో

బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తికి బంపర్ ఆఫర్ తలిగింది. నేషనల్ లాటరీ టికెట్‌ను కొన్న ఓ వ్యక్తి ఏకంగా 177 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.1800 కోట్లు)ను గెలుచుకున్నారు. యూకేలోని మూడో అతిపెద్ద లాటరీ ప్రైజ్‌మనీ ఇదేనని తెలిసింది. లాటరీ నిర్వాహకులు డ్రా తీయగా 07, 11, 25, 31, 40 నంబరు టికెట్‌కు జాక్‌పాట్ దక్కినట్లు ప్రకటించారు. ఈ లాటరీ టికెట్‌ని ఒక వ్యక్తి మాత్రమే తీసుకున్నట్లుయితే ఈ ఏడాది సండే టైమ్స్ రిచ్ లిస్ట్‌లో ఉన్న సంగీత కళాకారులు హ్యారీ స్టైల్స్, అడెలె కంటే ధనవంతుడిగా నిలుస్తాడని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. మరోవైపు విజేతకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచారు.