డొనాల్డ్ ట్రంప్ విజయంతో .. మస్క్ సంపద రూ.2 లక్షల కోట్లకు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడి, విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కోసం విస్తృత ప్రచారం చేశారు ఎలాన్ మస్క్. ఈ ప్రపంచ కుబేరుడు ట్రంప్‌నకు మద్దతు ఇవ్వడమే కాకుండా పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు. ఈ విజయంతో మస్క్ సంపద రూ.రెండు లక్షల కోట్ల (26.5 బిలియన్ల డాలర్లు) మేర పెరిగింది. దాంతో ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటిస్థానంలో ఉన్న ఆయన నికర సంపద 290 బిలియన్ల డాలర్లకు చేరింది. ఈ ఎన్నికల ఫలితాలు మస్క్ సంస్థల షేర్లపై సానుకూల ప్రభావాన్ని చూపడం ఆయనకు లాభించింది. ఆయనతో పాటు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద 7.14 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.60 వేల కోట్లు) పెరిగి బిలియన్ డాలర్లకు చేరుకొంది. ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు, సీటీవో అయిన లారీ ఎలిసన్, ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ నికర సంపద కూడా పెరిగింది. ఇక ట్రంప్ విజయం తర్వాత అమెరికా మార్కెట్లలో జోష్ కనిపించింది.