America : అమెరికా రెట్టింపు సుంకాలతో .. భారత్‌పై

స్టీల్, అల్యూమినియం (Aluminum) పై అమెరికా (America) సుంకాలను రెట్టింపు చేయడంతో భారతీయ ఎగుమతులు ప్రభావితం అవుతాయని ఆర్థిక మేధోసంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీసియేటివ్ ( జీటీఆర్‌ఐ) తెలిపింది. ముఖ్యంగా వాల్యూ యాడెడ్, ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తులు, ఆటో విడిభాగాల (Auto parts) రంగాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. యూఎస్ స్టీల్ పరిశ్రమ మనుగడ దృష్ట్యా తమ దేశంలోకి దిగుమతి అవుతున్న స్టీల్ (Steel) , అల్యూమినియంపై ప్రస్తుతం ఉన్న 25 శాతం టారిఫ్‌ను 50 శాతానికి పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మే 30న ప్రకటించారు.
సుంకాల పెంపు జూన్ 4 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. భారత్‌పై సుంకాల పెంపు పరిణామం ప్రత్యక్షంగా ఉంటుంది. ట్రంప్ నిర్ణయంపై భారత ప్రభుత్వం అమెరికా అధికారులతో ద్వైపాక్షిక చర్చలు జరపాలి. ఈ సుంకాలను ప్రతిస్పందనగా అమెరికా ఎగుమతులపై భారత్ ప్రతికార సుంకాలను విధిస్తుందో లేదా చూడాలి అని జీఆర్‌టీఐ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు.