విమాన టికెట్ రూ.26 మాత్రమే .. భారత్ నుంచి వియత్నం!
భారత్ నుంచి వియత్నాంకు విమాన టికెట్ ధర కేవలం 26 రూపాయలేనట. జులైలో రెండు 7/7 వచ్చిన సందర్భగా గోల్డెన్ వీక్ పేరిట ఈ వీట్జెట్ విమాన సంస్థ ఈ ఆఫర్ను ప్రకటించింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమాన ప్రయాణాలకు టికెట్ ధరను కేవలం 7,700 వియత్నామీ డాంగ్లుగా నిర్ణయించింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం కేవలం 26 మాత్రమే. (వియత్నాం డాంగీ అంటే మన రూపాయికి 0.0034తో సమానం). ఈ ఆఫర్ జులై 7 నుంచి 13 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇప్పుడు టికెట్ కొనుగోలు చేసిన వారు వచ్చే ఏడాది మార్చి 26 నుంచి ప్రయాణం చేయొచ్చని పేర్కొంది. భారత ప్రయాణికులకు ప్రత్యేకంగా సెప్టెంబర్ నుంచే ప్రయాణించే వీలు కల్పించింది. భారత్కు చెందిన ప్రయాణికులు ఢిల్లీ, ముంబయి నుంచి హనోయ్, హో చి మిన్హ్ సిటీ, పు క్వాక్ నగరాకలు టికెట్ బుక్ చేసుకోవచ్చు. కంపెనీ మొయూల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. మొత్తం 7,77,777 టికెట్లను ఆఫర్ కింద అందుబాటులో ఉంచినట్లు కంపెనీ తెలిపింది.






