త్వరలో వడ్డీరేట్ల పెంపు : ఫెడ్
ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వెలువడ్డాయి. వడ్డీ రేట్ల పెంపు త్వరలో ఉంటుందని ఫెడ్ సంకేతాలు ఇచ్చింది. ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగాల కల్పన బలోపేతం అవుతోందని పేర్కొంది. కొవిడ్ కేసుల వ్యాప్తిపైనే ఆర్థిక వ్వవస్థ తీరు ఆధారపడి ఉంటుందని వివరించింది. అమెరికా ద్రవ్యోల్బణం దాదాపు 40 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. ద్రవ్యోల్బణం 2 శాతం ఎగువన ఉంది. అయితే ఉద్యోగ విపణి చాలా బలంగా ఉంది. ఫెడరల్ ఫండ్స్ రేటును పెంచడాన్ని త్వరలో ప్రారంభించాలని కమిటీ భావిస్తోంది అని ఫెడ్ తెలిపింది. నెలవారీ బాండ్ల కొనుగోళ్ల కార్యక్రమం మార్చిలో ముగిసే అవకాశం ఉందని సంకేతాలిచ్చింది. ఇదే సమయంలో రేట్ల పెంపు చేపట్టే అవకాశం ఉంది.






