టోటల్ నిర్ణయ ప్రభావం పెద్దగా ఉండదు : అదానీ

అమెరికా కేసు తేలే వరకు అదానీ గ్రూప్‌లో కొత్త పెట్టుబడులు పెట్టబోమని ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎనర్జీస్ తీసుకున్న నిర్ణయం వల్ల, అదానీ కంపెనీల కార్యకలాపాలు-వృద్ధి ప్రణాళికలపై తీవ్ర ప్రభావం పడదని అదానీ గ్రూప్ ప్రకటించింది. నిధుల సమీకరణపై కొత్తగా ఎటువంటి చర్చలూ టోటల్ ఎనర్జీస్‌తో జరపడం లేదని అదానీ గ్రీన్ ఎనర్జీ తెలిపింది. అదానీ గ్రూప్‌లో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదార్లలో టోటల్ కూడా ఒకటి కావడం గమనార్హం.