అదానీకి మరో ఎదురుదెబ్బ
అదానీ గ్రూప్‌కు మరో ఎదురు దెబ్బతగిలింది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ నివేదికతో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ ఎనర్జీ గ్రూప్ అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని నిలిపేసింది. అదానీ న్యూ ఇండస్ట్రీస్ గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ ప్రాజెక్ట్‌లో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదిరింది. టోటల్ ఎనర్జీ ఇంకా తుది ఒప్పందంపై సంతకాలు చేయలేదు., అకౌంటింగ్లో మోసాలకు పాల్పడినట్లు అదానీ గ్రూప్‌పై హిండ్న్బర్గ్ ఆరోపించింది. దీనిపై అదానీ గ్రూప్ నష్టనివారణ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా స్వతంత్ర ఆడిట్ చేయనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. దీని ఫలితాలు ఇంకా రావాల్సి ఉన్నందున ప్రస్తుతానికి పెట్టుబడి పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు టోటల్ ఎనర్జీ సీఈఓ పాట్రిక్ పాయాన్నే ప్రకటించారు. గత సంవత్సరం జూన్‌లో ఈ రెండు కంపెనీల మధ్య పెట్టుబడుల విషయంలో ఒక ఒప్పందం జరిగింది.






