టిక్ టాక్ సంచలన నిర్ణయం
సోషల్ మీడియా సంస్థ ఇండియాలో బ్యాన్ అయిన టిక్‌టాక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియా కేంద్రంగా పనిచేస్తున్న ఉద్యోగులందరినీ తొలగించింది. భారత్ నుంచి బ్రెజిల్, దుబాయ్ మార్కెట్లకు పని చేస్తున్న వారినందరికి ఉద్వాసన పలికింది. ఫలితంగా దాదాపు 40 మంది ప్రభావితం కానున్నారు. నిషేదం తరువాత భారత్‌లో తిరిగి ఎంట్రీ ఇవ్వాలన్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో టిక్‌టాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మూడు సంవత్సరాల క్రితం నిషేధానికి గురైన టిక్‌టాక్ ఆఫీసులను కూడా మూసివేయనుంది. టిక్‌టాక్ ఈ వారం 40 మందికి పింక్ స్లిప్‌లను అందించింది. తొలగించిన ఉద్యోగులను తొమ్మిది నెలల జీతాన్ని చెల్లిస్తామని పేర్కొంది తమ గ్లోబల్ ప్రాంతీయ సేల్స్ టీమ్స్‌కు సపోర్ట్ కోసం 2020లో భారత్‌లో ఏర్పాటు చేసిన రిమోట్ సేల్స్ సపోర్ట్ హబ్‌ను మూసివేయాలని నిర్ణయించామని టిక్‌టాక్ ప్రతినిధిని ఒకరు తెలిపారు.






