ప్రముఖ బిలియనీర్ థామస్ లీ ఇక లేరు
అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల సంస్థ లీ ఈక్విటీ అధినేత, బిలియనీర్ థామస్ లీ ఆత్మహత్యచేసుకున్నారు. తన ఆఫీసులోనే తుపాకీతో కాల్చుకుని ఆయన చనిపిపోయినట్లు తెలిసింది. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. మన్హట్టన్లోని తన కార్యాలయానికి వచ్చిన థామస్ లీ చాలా సేపటి వరకు గది నుంచి బయటకు రాలేదు. దీంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా లీ బాత్రూమ్లో రక్తపు మడుగులో కన్పించారు. దీంతో వెంటనే ఆమె 911కు కాల్ చేసింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే లోపే ఆయన మరణించారు. ఆయన తలకు బులెట్ గాయమైంది. లీ తనను తాను కాల్చుకుని మరణించి ఉంటారని పోలీసులు వెల్లడిరచారు. ఆయన మరణంపై కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే అందులో మృతికి గల కారణాలు వారు పేర్కొనలేదు.






