Krithivasan: టీసీఎస్ సీఈఓ పారితోషికం ఎంతో తెలుసా?

ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) సీఈఓ కృతివాసన్ (Krithivasan) 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.26.52 కోట్ల పారితోషికాన్ని అందుకున్నారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో అందుకున్న మొత్తంతో పోలిస్తే ఇది 4.6 శాతం అధికం. ఈ విషయాన్ని కంపెనీ వార్షిక నివేదిక (Company Annual Report)లో వెల్లడిరచింది. కృతివాసన్ ఏడాదికిగానూ అందుకున్న మొత్తంలో బేసిక్ శాలరీ (Basic Salary) రూ.1.39 కోట్లు కాగా, అలవెన్సులు (Allowances), ఇతర ప్రయోజనాల రూపంలో రూ.2.12 కోట్లు పొందారు. కేవలం కమీషన్ (లాభాల్లో వాటా) కింద రూ.23 కోట్లు అందుకున్నారు. కంపెనీలో ఉన్న 6.07 లక్షల మంది ఉగ్యోగులకు చెల్లించే సగటు జీతం కంటే ఇది దాదాపు 330 రెట్లు అధికం. 2023లో టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కృతివాసన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.