టీసీఎస్ రికార్డు.. దేశంలోనే

టాటా గ్రూప్‌కు చెందిన ఐటీ కంపెనీ టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) రికార్డు సృష్టించింది. ఈ కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల కోట్లు దాటింది. బిఎస్‌ఈ ప్రకారం మార్కెట్ ముగిసే సమయానికి టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.15.12 లక్షల కోట్లకు చేరింది. టాటా గ్రూపులో రూ.15 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను దాటిన తొలి కంపెనీ టీసీఎస్ కావడం విశేషం. దీంతో పాటు టాటా గ్రూప్ మొత్త మార్కెట్ క్యాపిటలైజేన్ రూ.30 లక్షల కోట్లను దాటింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టీసీఎస్ దేశంలోనే రెండో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. రూ.15 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన దేశంలో రెండో కంపెనీగా కాగా, మొదటి స్థానంలో రిలయ్స్ ఇండస్ట్రీస్ ఉంది. రిలయన్స్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేన్ రూ.19.32 లక్షల కోట్లుగా ఉంది.