Google: గూగుల్‌లో మరోమారు లేఆఫ్‌లు

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ (Google)మరోమారు ఉద్యోగుల తొలగింపు పక్రియ చేపట్టింది. గతంలో పెద్ద సంఖ్యలో తొలగించిన ఆ సంస్థ తాజాగా మేనేజ్‌మెంట్ రోల్స్‌లో ఉన్న వారికి ఉద్వాసన పలికింది. మేనేజర్, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్ హోదాల్లో పనిచేస్తున్న వారిలో 10 శాతం మందికి లేఆఫ్‌లు ప్రకటించింది. ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai ) ఆల్ హ్యాండ్ మీటింగ్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పెన్‌ఏఐ వంటి ఏఐ సంస్థల నుంచి పోటీ పెరుగుతున్న వేళ తన సామర్థ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పిచాయ్ పేర్కొన్నారు. తాజా నిర్ణయంలో భాగంగా కొందరి హోదాలను తగ్గించి వారిని వ్యక్తిగత పాత్రలకే పరిమితం చేయనున్నారు. మరికొన్ని ఉద్యోగాలను పూర్తిగా తొలగించనున్నట్టు గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.