Star Link : స్టార్ లింక్ సేవలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎలాన్ మస్క్ (Elon Musk) కు చెందిన స్టార్ లింక్(Star Link) కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్సును టెలికాం విభాగం జారీ చేసింది. దీంతో ఈ లైసెన్స్ పొందిన మూడో కంపెనీగా స్టార్ లింక్ నిలిచింది. యులెల్సాట్ వన్‌వెబ్, రిలయన్స్ జియో (Reliance Jio) ఇది వరకే ఈ లైసెన్సును పొందాయి. దరఖాస్తు చేసుకున్న 15-20 రోజుల్లోనే ట్రయల్ స్పెక్టమ్ మంజూరు చేస్తామని డాట్ వర్గాలు తెలిపారు.ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) అనుబంధ సంస్థ అయిన స్టార్‌లింక్ వివిధ దేశాల్లో ఇంటర్నెట్ (Internet) సర్వీసులను అందిస్తోంది. మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలందించేందుకు స్టార్ లింక్ ఉపయోగపడుతుంది. ఇప్పటికే 100+ దేశాల్లో ఈ సేవలు లభిస్తున్నాయి. త్వరలో భారత్ కూడా ఈ జాబితాలో చేరనుంది.