వచ్చే నెల 1 నుంచి అయోధ్యకు… స్పైస్ జెట్ సేవలు

అయోధ్యకు ఏకంగా రోజువారిగా ఎనిమిది విమాన సర్వీసులను నడుపబోతున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. వచ్చే నెల 1 నుంచి ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, పాట్నా, ముంబై, బెంగళూరుల నుంచి అయోధ్యకు రోజువారి విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ నూతన విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్యా సింధియూ ప్రారంభించనున్నారు.