బ్రాండ్ అంబాసిడర్ నయనతారతో ‘రస్ ఐసా కి బస్ నా చలేగా’ అంటూ తమ మొట్టమొదటి ప్రచారాన్ని ప్రారంభించిన స్లైస్

సాటిలేని మామిడి అనుభవం అందించటంతో పాటుగా వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నంలో, స్లైస్®, తమ నూతన బ్రాండ్ అంబాసిడర్ మరియు లేడీ సూపర్‌స్టార్, నయనతారతో తమ మొట్టమొదటి ప్రచారాన్ని ఈరోజు ప్రారంభించింది. మంత్రముగ్ధులను చేసే ఈ వేసవి ప్రచారం, ‘రస్ ఐసా కి బస్ నా చలేగా’ ద్వారా అస్సలు వదులుకోలేనట్టి మామిడి కోరికలను తీర్చడానికి అత్యుత్తమ సహచరుడిగా స్లైస్ ® స్థానాన్ని పదిలపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆకట్టుకునే ఈ టివిసి ద్వారా, ఇది స్లైస్ ® యొక్క వదులుకోలేని ఆకర్షణను నొక్కి చెబుతుంది, ప్రామాణికమైన మామిడి రుచుల అనుభవంతో సమానమైన దాని సారూప్యతను వెల్లడిస్తుంది. ఈ ప్రచారంతో, ఈ బ్రాండ్ మార్కెట్‌లలో నయనతార యొక్క విస్తృత ఆకర్షణను ఉపయోగించుకోవడం ద్వారా దక్షిణ భారతదేశంలోని వినియోగదారులతో దాని అనుబంధాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది.
ఒక ఈవెంట్‌కి బయలుదేరడానికి సిద్ధమవుతున్న నయనతార , చక్కగా అలంకరించుకుని ఉంటుంది, ఆమె చూపు అద్దంపై ఉంచడంతో టివిసి ప్రారంభమవుతుంది. ఆమె బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు, మామిడి పండ్లు మరియు మెరుస్తున్న స్లైస్ ® సీసాల ఆకర్షణీయమైన ప్రదర్శన ఆమె దృష్టిని ఆకర్షించింది. మనోహరమైన చిరునవ్వుతో, ఆమె ఒక సీసాని పట్టుకుని, అపరిమితమైన ఆనందంతో మునిగిపోతుంది. గజిబిజిగా రసాలు ఆమె చేతుల్లోకి ప్రవహిస్తున్నప్పటికీ, నయనతార ఎలాంటి సంకోచం లేకుండా స్లైస్ ® యొక్క రసవంతమైన రుచిని ఆస్వాదిస్తూ, నిజమైన మామిడి అనుభవాలలో పూర్తిగా లీనమై పోతుంది. అంతలో , ఆమె స్నేహితులు ఆమెకు ఈవెంట్‌ను గుర్తు చేయడానికి కాల్ చేస్తారు, కానీ వారు కూడా మంత్రముగ్దులను చేసే సన్నివేశానికి ఆకర్షితులయ్యారు, స్లైస్ ® రుచి చూడాలని అడుగుతారు మరియు చివరికి ప్రామాణికమైన మామిడి పండు యొక్క తిరుగులేని ఆకర్షణకు లొంగిపోతారు. ఈ టివిసి మామిడిపండు ఆస్వాదించడంలో ఆనందకరమైన అనుభవాలు మరియు స్వచ్ఛమైన అనుభూతులను చూపటం తో పాటుగా ఈ అనుభవం యొక్క సారాంశాన్ని స్లైస్ ® ఎలా సంగ్రహిస్తుందో నొక్కి చెబుతుంది.
ఈ ప్రచారంపై పెప్సికో ఇండియా స్లైస్ మరియు ట్రోపికానా అసోసియేట్ డైరెక్టర్ అనూజ్ గోయల్ మాట్లాడుతూ, “ఒక బ్రాండ్‌గా, స్లైస్ అత్యంత ప్రామాణికమైన మామిడి అనుభవాన్ని అందించడానికి అంకితం కావటం తో పాటుగా భారతీయ మార్కెట్లో అపూర్వ గౌరవాన్ని కలిగి ఉంది. మా సరికొత్త వేసవి ప్రచారం ఎటువంటి అడ్డంకులు లేకుండా మామిడి పండ్ల ప్రయాణాన్ని ఆస్వాదించే అత్యుత్తమ స్లైస్ ఎథోస్‌ను కలిగి ఉంది. దీనికి అనుగుణంగా, మా కొత్త బ్రాండ్ అంబాసిడర్ నయనతారతో మా మొట్టమొదటి టివిసి ని పరిచయం చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. దక్షిణాదిలో మా మార్కెట్ కార్యకలాపాలను విస్తరించే లక్ష్యంతో తీసుకువచ్చిన ఈ టివిసిలో , భారతదేశపు ‘లేడీ సూపర్‌స్టార్’ నయనతార తన మనోహరమైన వ్యక్తిత్వం మరియు భారీ అభిమానుల సంఖ్యతో బ్రాండ్ యొక్క తత్వశాస్త్రానికి పరిపూర్ణ స్వరూపం గా నిలుస్తారు. మా ప్రచారం ద్వారా, స్లైస్ యొక్క అస్సలు వదులుకోలేనట్టి మామిడి ఆకర్షణను నొక్కి చెప్పడం మా లక్ష్యం, మామిడి వినియోగం యొక్క సంతోషకరమైన అనుభూతులు మరియు పరిపూర్ణమైన అభిరుచిని ఇది ప్రదర్శిస్తుంది. మా వినియోగదారులు స్వచ్ఛమైన-మామిడి ఆనందాన్ని ఆస్వాదిస్తారని మరియు నయనతార యొక్క చురుకైన స్క్రీన్-ప్రెజెన్స్‌తో వారి అనుభవం మరింత మెరుగుపడుతుందని మేము ఆశాజనకంగా ఉన్నాము…” అని అన్నారు.
ఈ చిత్రం గురించి నటి మరియు స్లైస్ బ్రాండ్ అంబాసిడర్ అయిన నయనతార మాట్లాడుతూ, “నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన, నా హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న బ్రాండ్ అయిన స్లైస్‌తో భాగస్వామి కావడం పట్ల నేను చాలా సంతోషంగా వున్నాను. ప్రయాణ సమయం లో సైతం అధీకృత మామిడి అనుభవాలను ఇది అందిస్తుంది. ఈ ప్రచారాన్ని చిత్రీకరించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది, ఎందుకంటే నేను మామిడి పళ్లను ఎలా తినాలనుకుంటున్నానో అలా పూర్తిగా స్లైస్ అనుభవంలో మునిగిపోయాను. ప్రారంభం నుండి ముగింపు వరకు, ఇది చాలా ఆనందకరమైన ప్రయాణంలా నిలిచింది. నా అభిమానులు ఈ చిత్రాన్ని చూసేందుకు మరియు నేను చేసినట్లుగా ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా ఎదురులేని మామిడి అనుభవాన్ని పొందడం చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అని అన్నారు.
కొత్త స్లైస్ ® టివిసి సమగ్ర ప్రచారంతో టీవీ, డిజిటల్, అవుట్‌డోర్ మరియు సోషల్ మీడియా అంతటా విస్తరించబడుతుంది. స్లైస్ ® భారతదేశంలోని అన్ని ఆధునిక మరియు సాంప్రదాయ రిటైల్ అవుట్‌లెట్‌లలో, అలాగే ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో సింగిల్ మరియు బహుళ సర్వ్ ప్యాక్‌లలో అందుబాటులో ఉంది.
*నీల్సన్ IG అధ్యయనం ద్వారా భారతదేశంలో అత్యంత చిక్కటి మరియు రుచికరమైన మామిడి పానీయం స్లైస్ యొక్క స్థానం ధృవీకరించబడింది.