అన్ని దేశాలు కలిస్తేనే … ఈ సమస్యకు పరిష్కారం
క్రిప్టోలను మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధులు సమీకరించేందుకు ఉపయోగించే ముప్పు పొంచి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. క్రిప్టోలతో అన్ని దేశాలకు ఉన్న అతిపెద్ద ముప్పు ఇదే అని, మనీలాండరింగ్, గ్రవాదానికి ఆర్థిక సాయం అందించేందుకు ఈ కరెన్సీని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటనలోని ఓ సెనినార్లో పాల్గొని మాట్లాడారు. క్రిప్టో కరెన్సీ వియంలో ఈ సమస్య పరిష్కరించేందుకు టెక్నాలజీలతో కూడిన నియంతణ అవసరమని భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఏ ఒక్క దేశమో నిర్వహించడం అసాధ్యమని, బోర్డులోని అన్ని దేశాలు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.






