భారీగా తగ్గిన ఎన్ఆర్ఐల నిధులు..ఎందుకో తెలుసా?
ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) నిధులపై కొవిడ్ ప్రభావం పడింది. ఈ మమమ్మారి దెబ్బతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో గల్ఫ్ సహకార కూటమి (జీసీసీ) దేశాల్లోని ప్రవాస భారతీయులు, స్వదేశానికి పంపే నిధుల మొత్తం భారీగా తగ్గింది. 2016-17 ఆర్థిక సంత్సరంలో ఎన్ఆర్ఐల నుంచి మన దేశానికి వచ్చిన నిధుల్లో 50 శాతానికి పైగా ఈ దేశాల నుంచే వచ్చింది. 2020-21లో ఇది ఏకంగా 30 శాతానికి పడిపోయినట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వెల్లడిరచింది. ఇదే సమయంలో అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి సంపన్న దేశాల్లోని ఎన్ఆర్ఐలు పంపే నిధులు 36 శాతానికి చేరాయి.
అమెరికాలోని ఎన్ఆర్ఐలు యూఏఈని తోసిపుచ్చి ఈ జాబితాలో తొలి స్థానం సంపాదించారు. 2020-21లో ఎన్ఆర్ఐల ద్వారా సమకూరిన మొత్తం నిధుల్లో 23 శాతం అమెరికాలో ప్రవాసుల ద్వారా సమకూరాయి. దీనికి తోడు ఎన్ఆర్ఐల నుంచి ఎక్కువ నిధులు అందుకుంటున్న రాష్ట్రాల్లో కేరళను తోసిపుచ్చి మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది.






