SBI: ఎస్‌బీఐ హెచ్చరిక .. అలాంటి నమ్మొదు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు, సాధారణ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. నకిలీ డీప్‌ఫేక్ వీడియో(Video) ల పట్ల జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్ సూచించింది. సోషల్ మీడియా (Social media) లో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయని, అందులో బ్యాంకు సీనియర్ అధికారులను చూపించి పెట్టుబడి పథకాలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని బ్యాంక్ పేర్కొంది. ఈ పథకాలతో బ్యాంకుకు లేదా దాని అధికారులకు ఎలాంటి సంబంధం లేదని ఎస్‌బీఐ (SBI) స్పష్టం చేసింది. అలాగే ప్రజలు ఈ వీడియోలను నమ్మొద్దని, మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని ఎస్‌బీఐ సోషల్ మీడియా ద్వారా వెల్లడిరచింది.