ఎస్‌బీఐ మరో అరుదైన ఘనత

ప్రభుత్వ రంగంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ ( ఎస్‌బీఐ) అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా ఎస్‌బీఐ ఎంపికైంది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఎస్‌బీఐని బెస్ట్ బ్యాంకర్‌గా ఎంపిక చేసింది. వాషింగ్టన్‌లో జరిగిన ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశంలో భాగంగా 31వ వార్షిక ఉత్తమ బ్యాంక్ అవార్డుల కార్యాక్రమంలో ఈ పురస్కారాన్ని అందించారు. అసాధారణ సేవలు అందించిన కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడంలో తమ బ్యాంక్ ముందంజలో ఉందని ఎస్‌బీఐ తెలిపింది. చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ఈ అవార్డును అందుకున్నారు. అదే కార్యక్రమంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ బెస్ట్ ఈసీఓ (గవర్నర్) అవార్డు అందుకున్నారు.