సామ్ సంగ్ మరో కీలక నిర్ణయం.. ఈ ఏడాది నుంచి ఇక్కడే

కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగ్గజం సామ్ సంగ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది నుంచి నోయిడా ఫ్యాక్టరీలోనే ల్యాప్‌టాప్‌లను ఉత్పత్తి చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం లేదని, ఇక్కడే తయారు కానుండటంతో ధరలు తగ్గే అవకాశం కూడా ఉంటుందని సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్ టీఎం రోప్‌ా తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రభుత్వాల సహాయ సహకారాలు ఉండటంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నట్లు, దీంట్లో భాగంగానే ల్యాప్‌టాప్‌లను ఇక్కడ తయారు చేస్తున్నట్లు తెలిపారు.