శాంసంగ్ కీలక నిర్ణయం
ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి తమ ఉత్పత్తుల సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్ని దగ్గరి నుంచి పరిశీలిస్తున్నామని శాంసంగ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రానిక్ చిప్స్ దగ్గరి నుంచి స్మార్ట్ఫోన్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సహా ఇతరత్రా ఉత్పత్తలన్నింటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రష్యా దాడుల వల్ల ప్రభావితం అవుతున్న ప్రతి ఒక్కరి గురించి తాము ఆందోళన చెందుతున్నామని తెలిపింది. తమ ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రతే ప్రస్తుతం తమ ప్రథమ కర్తవ్యమమని పేర్కొంది. ఉక్రెయిన్‌కు 6 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని శాంసంగ్ ప్రకటించింది. ఇందులో 1 మిలియన్ డాలర్ల విలువ చేసే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయని తెలిపింది. కాగా ఇప్పటికే యాపిల్, మైక్రోసాఫ్ట్, ఐకియా, నైక్ వంటి టెక్ దిగ్గజాలు సైతం ఇప్పటికే రష్యాలో తమ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.






