శాంసంగ్ కీలక నిర్ణయం.. 200 మంది ఎగ్జిక్యూటివ్‌లను

ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ శాంసంగ్ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యాపారం మందగించడంతో భారత్‌లోని కార్యాలయాల్లో ఎగ్జిక్యూటివ్‌లుగా విధులు నిర్వహిస్తున్న 200 మందిని తొలగించనుంది. మొత్తం 2000 మందికిపైగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌లలో దాదాపు 10 శాతం మందిపై ఈ ప్రభావం పడనుంది. యూజర్ల డిమాండ్ తగ్గడంతో శాంసంగ్ విక్రయాలు క్షీణించాయి. దీంతో స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలో శాంసంగ్ వాటా క్రమంగా తగ్గింది. ఈ క్రమంలో కంపెనీ ఖర్చులను తగ్గించే పనిలో పడిరది. అందులో భాగంగా లేఆఫ్‌ల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, సపోర్ట్ ఫంక్షన్ విభాగంలోనే తొలగింపులు ఉండనున్నాయి. ఉద్యోగం కోల్పోయిన వారికి ఒప్పందం ప్రకారం మూడు నెలల వేతనం, ఇతరత్రా ప్యాకేజీలు ఇవ్వనున్నారు.