అన్నంత పనిచేసిన పుతిన్…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నంత పని చేశారు. సహజ వాయువు కావాలంటే రష్యన్ కరెన్సీ రూబుల్స్లోనే చెల్లింపులు చేయాలంటూ ఆయన మిత్రపక్షాలు కానీ దేశాలను డిమాండ్ చేసిన విషయం విదితమే. ఈ హెచ్చరికలను ఇప్పుడు నిజం చేశారాయన. ఈ తరుణంలో రూబుల్స్లో చెల్లింపులకు నిరాకరించిన పోల్యాండ్, బల్గేరియాలకు గాజ్ప్రోమ్ నుంచి గ్యాస్ సరఫరాను నిలివేయించారు. రష్యా ఎనర్జీ దిగ్గజం గాజ్ప్రోమ్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పోల్యాండ్ బల్గేరియా లకు పూర్తిగా గ్యాస్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. రూబుల్స్ రూపేణా బకాయిలు చెల్లింపుల మూలంగానే ఈ పని చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.






