గూగుల్‌కు భారీ షాక్.. భూమిపై ఉన్న డబ్బు కంటే ఎక్కువ!

టెక్ దిగ్గజం గూగుల్‌కు రష్యాలోని మాస్కో కోర్టు భారీ షాక్ ఇచ్చింది. తమ దేశ యూట్యూబ్ ఛానల్స్‌పై వేటు వేసినందుకు గూగుల్‌కు 2 అన్‌డెసిలియన్ రష్యన్ రూబుళ్ల (2.5 డెసిలియన్ అమెరికా డాలర్లు) భారీ జరిమానా విధించింది. అంటే భూమిపై చలామణీలో ఉన్న నగదు కంటే ఎక్కువన్న మాట. ఒక ఆన్‌డెసిలియన్ అంటే 1 తర్వాత 36 సున్నాలు ఉంటాయి. 2020 నుంచి ఇప్పటి వరకు క్రెమ్లిన్ అనుకూల, రష్యా ప్రభుత్వ అధికార మీడియా సహా 17 ఛానల్స్‌ను యూట్యూబ్ నిలిపివేసింది. ఈ ఛానల్స్‌ను పునరుద్ధరించాలని మాస్కో కోర్టు ఆదేశించినా గూగుల్ నిరాకరించింది. దీంతో గూగుల్‌కు మాస్కో కోర్టు అతి భారీ జరిమానా విధించింది. ప్రపంచ జీడీపీ 100 ట్రిలియన్ డాలర్ల కంటే కూడా ఇది అధికం. అంత పెద్ద మొత్తంలో ఫైన్ కట్టడం గూగుల్‌కు దాదాపు సాధ్యం కాకపోవచ్చు. రష్యన్ కోర్టులు ఇచ్చే తీర్పుల ప్రభావం తమపై పడకుండా గూగుల్ గతంలోనే జాగ్రత్తపడిరది. రష్యన్ టీవీ ఛానళ్ల యజమానులకు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్ కోర్టులో వ్యాజ్యాలను దాఖలు చేసింది.