Judy Garland: ఆ చెప్పుల ధర రూ.237 కోట్లు

అమెరికాకు చెందిన నటీ, గాయకురాలు, జూడి గార్లండ్ ది విజర్డ్ ఆఫ్ ఓజ్ (The Wizard of Oz) చిత్రంలో ధరించిన రుబీ చెప్పులను తాజాగా వేలం వేశారు. అవి ఏకంగా 28 మిలియన్ డాలర్లు (రూ.237 కోట్లకు పైగా) పలికాయి. దాదాపు 20 ఏళ్ల క్రితం చోరీకి గురైన ఆ చెప్పులు తాజా వేలంలో అంత ధర పలకడం విశేషం. డాలస్(Dallas)కు చెందిన ఓ సంస్థ ఈ వేలాన్ని నిర్వహించింది. జూడి గార్లండ్.. ది విజర్డ్ ఆఫ్ ఓజ్ చిత్రంలో గార్లండ్ ఈ చెప్పులను ధరించిన అనంతరం.. మిన్నెసోటా (Minnesota) లోని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. 2005లో అవి చోరీకి గురయ్యాయి. ఆ తర్వాత ఎఫ్‌బీఐ (FBI) అధికారులు దర్యాప్తు చేపట్టి 2018లో వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఈ పాదరక్షలను వేలం వేశారు. వాటిని ఎవరు కొనుగోలు చేశారనే వివరాలు మాత్రం తెలియరాలేదు.