RBI: రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన

రూ.2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) (ఆర్‌బీఐ) కీలక ప్రకటన చేసింది. వెనక్కి తీసుకున్న రూ.2వేల నోట్ల ఇంకా పూర్తిస్థాయిలో రిజర్వ్ బ్యాంక్‌కు చేరలేదని పేర్కొంది. ప్రస్తుతం రూ.6,181 కోట్ల విలువైన నోట్లు ఇంకా ప్రజల (People’s) వద్దే ఉన్నాయని పేర్కొంది. నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ 2016 నవంబర్ 8న (On November 8th) రూ.2వేల నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బ్లాక్ మనీ, అనినీతి, నకిలీ కరెన్సీకి బ్రేకులు వేసేందుకు కేంద్రం నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. నోట్ల రద్దుతో వచ్చే కరెన్సీని కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం రూ.2 వేల కోట్లను తీసుకువచ్చింది. మహాత్మ గాంధీ (Mahatma Gandhi) సిరీస్ నోట్లలో భాగంగా అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో నోట్లను విడుదల చేసింది.