Reliance jio : రిలయన్స్ జియో కీలక నిర్ణయం … ఇక ఒక్కరోజే

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance jio) కీలక నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ జియో యూజర్లకు షాకిచ్చింది. రోజువారీ డేటా(Data) పరిమితి అయిపోయినప్పుడు వినియోగించే రూ.19, రూ.29 డేటా వోచర్ల వ్యాలిడిటీని కుదించింది. జియో వెబ్‌సైట్ (Jio website )లో ప్లాన్లను పరిశీలిస్తే ఇప్పటికే కొత్త కాలపరిమితులు అమల్లోకి వచ్చాయని స్పష్టమవుతోంది. రోజువారీ డేటా అయిపోయినప్పుడు, అదనపు డేటా అవసరమైనపుడు ఇంటర్నెట్ సేవలు పొందేందుకు ప్రత్యేక డేటా ప్యాక్‌లను అందిస్తోంది. రూ.19 ప్లాన్‌తో 1జీబీ డేటా, రూ.29 ప్లాన్‌తో 2జీబీ డేటా ఇస్తోంది. ప్రస్తుతం ప్లాన్ గడువు ముగిసే వరకు ఈ డేటా వోచర్లకు వ్యాలిడిటీ ఉండేది. తాజాగా కాలవ్యవధిని కుదించింది. రూ.19 ప్లాన్ కాలవ్యవధిని ఒక్క రోజుకు పరిమితం చేసింది. రూ.29 ప్లాన్‌కు గడువును రెండు రోజులుగా నిర్ణయించింది. ప్రస్తుతం తక్కువ ధరలో రూ.11తో మరో డేటా ప్యాక్‌ను అందిస్తోంది. కేవలం ఒక గంట వ్యవధి కలిగిన ఈ ప్యాక్‌తో అపరిమిత డేటా పొందొచ్చు.