Reliance : రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు మరో గౌరవం … ప్రపంచంలోనే

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries)కు మరో గౌరవం దక్కింది. ప్రపంచంలోని 30 అత్యంత విలువైన లిస్టెడ్ టెక్ దిగ్గజ కంపెనీల జాబితాలో రిలయన్స్‌కూ చోటు లభించింది. ఈ లిస్ట్‌లో స్థానం దక్కించుకున్న ఏకైక భారత కంపెనీ ఇదే. 21,600 కోట్ల డాలర్ల( రూ.18.45 లక్షల కోట్లు) మార్కెట్ విలువతో రిలయన్స్ 23వ స్థానంలో నిలిచింది. కాగా అమెరికా చెందిన మైక్రోసాఫ్ట్ (Microsoft), ఎన్‌విడియా, యాపిల్ (Apple) , అమెజాన్ (Amazon) , ఆల్ఫాబెట్, మెటా ప్లాట్‌ఫామ్స్, టెస్లా, బ్రాడ్‌కామ్ వరుసగా తొలి 8 స్థానాలను కైవసం చేసుకున్నాయి. తైవాన్ (Taiwan) కు చెందిన టీఎస్‌ఎంసీ 9వ స్థానంలో ఉంది. చైనా కంపెనీ టెన్సెంట్ 10వ స్థానంలో ఉంది.