RBI: కీలక వడ్డీరేట్లు యథాతథమే : ఆర్‌బీఐ

విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎమ్‌పీసీ) సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) ప్రకటించారు. రెపో రేటు 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడిరచారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 11వ సారి కావడం గమనార్హం. డిసెంబరు (December) 4 నుంచి మూడు రోజుల పాటు ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిగింది. ఆ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడిరచారు. ద్రవ్యోల్బణం, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా వడ్డీరేట్లలో మార్పులు చేయొద్దని నిర్ణయించినట్లు తెలిపారు. ఈసారి స్థిర విధాన వైఖరిని కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.