ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు

బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్‌కు సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. గడిచిన రెండేళ్లలో ఎలాంటి లావాదేవీలూ జరపని ఖాతాల విషయంలో మినిమ్ బ్యాలెన్స్ లేదన్న కారణంతో ఛార్జీలు విధించొద్దని బ్యాంకులకు స్పష్టం చేసింది. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నగదు బదిలీ కోసం తెరిచిన ఖాతాలు రెండేళ్లకు మించి వాడుకలో లేనప్పటికీ వాటిని నిరుపయోగంగా లేని ఖాతాలుగా గుర్తించకూడదని సూచించింది. అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను తగ్గించడంలో భాగంగా ఆర్‌బీఐ ఈ సర్కులర్ జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆర్‌బీఐ కొత్త నిబంధనల ప్రకారం వాడుకలో లేని ఖాతాలు ఖాతాదారులకు తెలియజేయాలి. ఒకవేళ ఖాతాదారులు అందుబాటులో లేని పక్షంలో నామినీకి ఆ సమాచారాన్ని చేరవేయాలని బ్యాంకులకు ఆర్‌బీఐ వెల్లడించింది.