Pure: అమెరికా, కెనడా మార్కెట్లోకి ప్యూర్

బ్యాటరీ సాంకేతికత, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ స్టోరేజీ ఉత్పత్తుల్లో కార్యకలాపాలు సాగిస్తున్న వ్యూర్ సంస్థ, కెనడా (Canada) కు చెందిన ఛార్జ్ పవర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదర్చుకుంది. నివాస, వాణిజ్య, గ్రిడ్ స్థాయి ఎనర్జీ స్టోరేజీ ఉత్పత్తులతో అమెరికా (America), కెనడా మార్కెట్లలోకి ప్రవేశించేందుకు ఇది తోడ్పడనుంది. అత్యధిక ఎనర్జీ సాంద్రత కలిగిన లి-అయాన్ బ్యాటరీలు, 5వ తరం పవర్ ఎలక్ట్రానిక్స్, ఏఐ సాంకేతికతలను ఉపయోగించి ప్యూర్ పవర్ ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు ప్యూర్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డి.నిశాంత్ (D. Nishant) తెలిపారు. అమెరికా, కెనడా మార్కెట్లలోనూ వీటికి గిరాకీ లభిస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ కార్యకలాపాల విస్తరణ వ్యూహంలో, ఈ మార్కెట్లు కీలకంగా ఉండబోతున్నాయన్నారు. అత్యుత్తమ ఎనర్జీ స్టోరేజీ పరిష్కారాలను అందించాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా ప్యూర్‌తో చేతులు కలిపినట్లు ఛార్జ్ పవర్ మేనేజింగ్ డైరెక్టర్ రవి పిన్నెల్లి (Ravi Pinnelli) తెలిపారు.