విస్తరణలో పొసిడెక్స్ టెక్నాలజీస్

కస్టమర్ డేటా మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ అందించే పొసిడెక్స్ టెక్నాలజీస్ ఇతర మార్కెట్లలోని కస్టమర్లకు చేరువయ్యే ప్రణాళికల్లో ఉంది. ఉత్తర అమెరికా, మధ్యప్రాచ్యంలో మరింతగా కార్యకలాపాలను విస్తరించనున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు కె.వెంకట్ రెడ్డి తెలిపారు. రీబ్రాండింగ్‌లో భాగంగా కొత్త లోగోను క్రీడాకారిణి పీవీ సింధు ఆవిష్కరించారు. రెండు దశాబ్దాల వ్యవధిలో 60పైగా దిగ్గజ సంస్థలకు సేవలను అందించినట్లు వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా 9 భారీ ప్రైవేట్ బ్యాంకుల్లో ఏడిరటికి, 15 నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో తొమ్మిదింటికి సర్వీసులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.