పేటీఎంలో మళ్లీ లే ఆఫ్ లు

పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసింది. ఎంత మందిని తొలగించినది మాత్రం ఆ కంపెనీ వెల్లడించలేదు. ఉద్యోగాలు కోల్పోయిన వారు మరో ఉద్యోగం పొందడంలో తాము సాయం అందిస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ఉద్యోగాలు తొలగించాల్సి వచ్చినట్టు పేర్కొన్నది. ఉద్వాసనకు గురైన వారు వేరే సంస్థల్లో ఉద్యోగాలు పొందడంలో సాయం అందిస్తున్నామని, తమ హెచ్‌ఆర్ టీమ్ 30 సంస్థలతో కలిసి పనిచేస్తున్నదని వివరించింది.