ఉద్యోగులకు షాక్ ఇచ్చిన పేపాల్.. ప్రపంచవ్యాప్తంగా 2,500 మందిపై

ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో దిగ్గజ సంస్థ లేఆఫ్స్ ప్రకటించి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఫైనాన్షియల్ టెక్నాలజీ దిగ్గజం పేపాల్ ప్రపంచ వ్యాప్తంగా 9 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ నిర్ణయంతో సుమారు 2,500 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఈ మేరకు ఉద్యోగులకు కంపెనీ సీఈవో అలెక్స్ క్రిస్ లేఖ రాశారు. ఉద్యోగాలు కోల్పోతున్న వారికి ఈ వారాంతంలో సమాచారం అందజేస్తామని లేఖలో వెల్లడించారు. కంపెనీలో డూప్లికేషన్ తగ్గించడం, వనరులను సమర్థంగా వినియోగించడం, ఆటోమేషన్ వినియోగంతో సంక్లిష్టతలు తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అభివృద్ధికి అవకాశం ఉన్న విభాగాల్లో తమ పెట్టుబడులు కొనసాగిస్తామని ఈ సందర్భంగా క్రిస్ పేర్కొన్నారు.