రూ.6.27 కోట్లు పలికిన.. టిప్పు సూల్తాన్ చిత్రం
మైసూరు పాలకుడు హైదర్ అలి, అతని తనయుడు టిప్పు సుల్తాన్ 1780లో నాటి ఈస్టిండియా కంపెనీపై సాధించిన చారిత్రక విజయానికి చిత్రరూపమిచ్చిన కళాఖండలు లండన్లో రూ.6.27 కోట్లు (6,30,000 పౌండ్లు) భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. 242 ఏళ్ల కిందట సెప్టెంబరు పదో తేదీన జరిగిన రెండో ఆంగ్లో`మైసూరు యుద్ధమిది. ది బ్యాటిల్ ఆఫ్ పోలిలుర్గా పేరొందిన ఈ యుద్ధం చిత్రాలు లండన్లోని సదబీస్ ఆక్షన్ హౌస్లో ఇస్లామిక్ వరల్డ్ అండ్ ఇండియా విభాగంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. స్ఫూర్తిదాయకమైన ఈ విజయం కలకాలం గుర్తుండేలా టిప్పు సుల్తాన్ స్వయంగా ఈ చిత్రాలు గీయించారు.






