ప్రపంచంలోనే అరుదైన వజ్రం వేలం
ప్రపంచంలోనే అరుదైన వజ్రం ఒకటి ఫిబ్రవరిలో వేలానికి రాబోతోంది. సోథ్ బీ సంస్థ దీన్ని వేలానికి ఉంచుతోంది. దీనిని గ్రహాంతర వజ్రంగా పేర్కొన్న సోథ్ బి సంస్థ దుబాయ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వజ్రం వివరాలను వెల్లడించింది. ఈ గ్రహాంతర వర్జాన్ని ఎనిగ్మా అని పిలుస్తారు. ఇది 555.55 స్వచ్ఛతను కలిగి వుంది. సంఖ్యా శాస్త్రం పరంగానూ అన్ని అంకెలు ఐదు కలిగి వుండటం కూడా అరుదైన విషయమని నిపుణులు చెబుతున్నారు. కార్బనాడోగో పేర్కొనే నల్ల వజ్రాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయని, భూమ్మీద ఇలాంటి కార్పనాడోగా వజ్రాలు బ్రెజిల్, మధ్య ఆఫ్రికాలో మాత్రమే దొరికాయని సోథ్‌బీ తెలిపింది.
వేలంలో దీని ప్రారంభ ధరను 5 మిలియన్ పౌండ్లుగా నిర్ణయించారు. మన కరెన్సీ ప్రకారం రూ.50 కోట్లన్న మాట. ఫిబ్రవరి 3న వేలానికి ముందు ఎనిగ్మా వజ్రాన్ని లాస్ఏంజెల్స్, లండన్లలోను ప్రదర్శనకు ఉంచనున్నారు. గతేడాది హాంకాంగ్‌లో 10138 వజ్రం 12.3 మిలియన్ డాలర్లకు విక్రయించబడిరది. నాటి రికార్డును ఎనిగ్మా బ్రేక్ చేస్తుందని అంచనాలున్నాయి.






