అమెజాన్, మెటా బాటలో ఈబే … వెయ్యి మందికి ఉద్వాసన

ఇ కామర్స్ సంస్థ ఈబే ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. తన సంస్థలో పనిచేస్తున్న వారిలో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తొలగింపు విషయాన్ని ఇ మెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేసింది. రానున్న రోజుల్లో మరికొన్ని రౌండ్లలో తొలగింపులు చేపట్టాలనే యోచనలో ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. మన వ్యూహాలకు వ్యతిరేక దిశలో కంపెనీ పురోగమిస్తున్నప్పుడు వ్యాపార వృద్ధిని మించి ఉద్యోగులు, ఖర్చులు ఉంటాయి. దీన్ని పరిస్కరించడానికి సంస్థాగత మార్పుల్ని అమలు చేస్తున్నాం. మా కస్టమర్ల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం అని కంపెనీ ఈసీఓ జామీ ఐయానోన్ ఉద్యోగులకు పంపిన ఇ మెయిల్‌లో తెలిపారు.