India భారత్లో భారీ పెట్టుబడులు .. రూ.6 వేల కోట్లతో

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్(One plus) భారత్ లో తన వ్యాపారంలో వచ్చే మూడేళ్లలో రూ.6 వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపింది. భారత్ లో ఉత్పత్తి ఆవిష్కరణలను, సేవలను మెరుగుపర్చడానికి వచ్చే మూడేళ్ల పాటు ఏటా రూ.2 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని కంపెనీ యోచిస్తోంది. భారత్ (India) బ్రాండ్కు సంబంధించిన భవిష్యత్తు పెట్టుబడి కోసం వ్యూహాత్మకంగా ప్రాజెక్ట్ స్టార్ లైట్ (Project Star Light) పేరుతో ఈ పెట్టుబడి ప్రణాళిక ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాజెక్ట్ స్టార్లైట్ పెట్టుబడి మూడు కీలక రంగాలపై దృష్టి సారిస్తుంది. మన్నికైన పరికారాలను తయారు చేయడం, మెరుగైన కస్టమర్ సేవలను అందించడం, నిర్దిష్ట ఫీచర్స్ను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని కంపెనీ భావిస్తున్నట్లు వన్ ప్లస్ ఇండియా సీఈఓ రాబిన్ లియు తెలిపారు.