ఫోర్బ్స్ జాబితాలో తెలుగువారికి స్థానం
హైదరాబాదీ స్టార్టప్ నెక్స్ట్ వేవ్ వ్యవస్థాపకులు శకాంక్ రెడ్డి గుజ్జుల, అనుపమ్ పెదర్లకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఇరువురు తెలుగువారికి ఈ ఏడాదికిగాను తాజాగా విడుదలైన ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో చోటు లభించింది. కాగా, తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన శశాంక్ రెడ్డి గుజ్జుల, ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాకు చెందిన అనుపమ్ పెదర్ల మరొకరితో కలిసి నెక్స్ట్ వేవ్‌ను ఏర్పాటు చేశారు. ఇదో కొత్త తరం టెక్నాలజీ ఉద్యోగార్థుల ఆన్లైన్ ఎంప్లాయబిలిటీ ప్లాట్‌ఫామ్. ఈ వేదిక ద్వారా ఇప్పటిదాకా యువత పెద్ద ఎత్తునే సాఫ్ట్వేర్ ఉద్యోగాలను పొందడం విశేషం.






