అమెరికాలో ఎన్‌విడియా ప్రభంజనం.. ఒక్కరోజే రూ.22 లక్షల కోట్ల

అమెరికా చిప్‌తయారీ కంపెనీ ఎన్‌విడియా షేరు ప్రభంజనం సృష్టించింది. ఒక్కరోజులోనే షేరు 16 శాతం పెరగడంతో, ఎన్‌విడియా మార్కెట్ విలువ 277 బిలియన్ డాలర్లు (రూ.22 లక్షల కోట్ల పైనే) అధికమై 1.96 లక్షల కోట్ల డాలర్ల (రూ.160 లక్షల కోట్లు)కు చేరింది. మనదేశ అగ్రగామి సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం మార్కెట్ విలువ రూ.20.21 లక్షల కోట్లు కాగా, ఎన్‌విడియో మార్కెట్ విలువ ఒక్కరోజే అంతకుమించి పెరగడం గమనార్హం. త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో ఎన్‌విడియా రాణించమే ఇందుకు కారణం. ఈ నెల 2న మెటా ప్లాట్‌ఫామ్స్ ఒక్కరోజు లాభం 196.8 బిలియన్ డాలర్ల రికార్డును ఇది తుడిచేసింది. మార్కెట్ విలువ పరంగా అమెజాన్, ఆల్ఫాబెట్‌లను అధిగమించి అమెరికాలోనే నాలుగో అత్యంత విలువైన కంపెనీగా ఎన్‌విడియా అవతరించచింది. మైక్రోసాఫ్ట్ 3.06 లక్షల కోట్ల డాలర్లు, యాపిల్ 2.85 లక్షల కోట్ల డాలర్లు, సౌదీ ఆరామ్‌కో 2.065 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువతో ఎన్‌విడియా కంటే ముందున్నాయి.